NLR: రెవెన్యూ శాఖకు సంబంధించి నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రావణ్‌ను జిల్లా కలెక్టర్ ఆనంద్ సస్పెండ్ చేశారు. టపాసులు దుకాణాలు మంజూరు రెవెన్యూ తదితరులకు సంబంధించిన అవకతవకలపై పాల్పడ్డాడు అన్న ఆరోపణలపై శ్రావణ్ పై వేటు పడింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.