NLR: నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో నవంబర్ 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కార్తీక లక్షదీపోత్సవ సంబరాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ని గురువారం నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ శర్మ, వెంకట ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.