TG: ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, ఇతర విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే డైట్, కాస్మోటిస్ ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.950 నుంచి రూ.1330కి పెంచింది. 8 నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1540 పెంచింది. ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు రూ.1500 నుంచి రూ.2,100 కాస్మొటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.