BPL గ్రూప్ ఛైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ మృతి పట్ల CM చంద్రబాబు సంతాపం తెలిపారు. భారతీయ ఎలక్ట్రానిక్స్‌కు మార్గదర్శకుడైన నంబియార్‌కు కోల్పోయినందుకు చాలా బాధగా ఉందన్నారు. తన అద్భుత నాయకత్వంతో BPLను బ్రాండ్‌గా మార్చాడన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అందించిన ఆయన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని CM చంద్రబాబు తన ‘X’లో పేర్కొన్నారు.