గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ దీపావళి పండుగ రోజు కన్నుమూశారు. గోపాలన్ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. 1990 సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్ రంగంలో BPL సత్తా చాటిందన్నారు. అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను లోకల్ బ్రాండ్‌గా గుర్తింపు తీసుకొచ్చిందని కొనియాడారు.