ASR: ప్రతీ ఒక్కరూ హింసకు దూరంగా ఉండాలని చింతపల్లి సీఐ కే.రమేష్, ఎస్సై వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి చింతపల్లి మండల కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి స్వార్థం లేకుండా అంకితభావంతో ప్రజారక్షణకు పోలీసులు కృషి చేస్తున్నారని అన్నారు. పోలీసు అమరవీరులకు జోహారు అంటూ నినాదాలు చేశారు.