JGL : కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామంలో మహిళా సంఘం భవనం పై కప్పు పనులను గురువారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. ఈ పనుల కోసం సీడీపీ నిధులు రూ. 3 లక్షలు మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అప్పట్లో మంజూరు చేశారన్నారు. ఆ నిధులతో గురువారం స్లాబ్ పనులు చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు సాంబ నవీన్, నరేందర్ రెడ్డి తెలిపారు.