WGL: బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శిగా నర్సంపేట పట్టణానికి చెందిన గాదగోని భిక్షపతి గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్, నియోజకవర్గ ఇన్ఛార్జి డ్యాగల శ్రీనివాస్ చేతుల మీదుగా భిక్షపతి గౌడ్ కు గురువారం నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో చెన్నూరి రవి, మద్దెల శ్యామ్ కుమార్ తదితరులున్నారు.