ప్రకాశం: టంగుటూరు మండలంలోని కారుమంచి గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటించనున్నట్లు గ్రామ టీడీపీ నాయకులు ఈదర ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో జరిగే ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొంటారని ఆయన అన్నారు. గ్రామ కూటమి నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.