AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చింది. వేద పండితుల ఇబ్బందులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలకు రూ.3వేల చొప్పున చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.