SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రీయ ఏక్తా దివస్లో భాగంగా ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినట్లు డీఎస్పీ సిహెచ్ వివేకానంద ఒక ప్రకటనలో తెలిపారు. దేశ ఐక్యత, భద్రతకు కృషి చేస్తామన్నారు.