TG: సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి కీలక ప్రకటన చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చుకోవాలని సూచించారు. ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చాయని ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకూ దీపావళి సందర్భంగా ఈ నిబంధనలు ఉంటాయని, ప్రజలు గ్రహించి తమకు సహకరించాలని కోరారు.