AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ప్రభుత్వాలు ఒక్క అడుగు కూడా వేయడం లేదని తెలిపారు. అనకాపల్లిలో మరో స్టీల్ ప్లాంట్ తెరపైకి తేవడం వెనుక దురుద్దేశం ఉందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామని చెప్పారు. పోలవరం, స్టీల్ ప్లాంట్ విషయంలో పొరపాటు చేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.