ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని సీసీ స్కూల్ గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను గిద్దలూరు ఎస్సై ఇమ్మానియేల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణ యజమానులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలి. ప్రతి ఒక్కరూ కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని దుకాణ యజమానులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై జిలాని, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.