మహారాష్ట్ర ఎన్నికల వేళ హస్తం పార్టీకి భారీ షాక్ తగిలింది. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న రవి రాజా పార్టీకి గుడ్‌బై చెప్పారు. దీపావళి పండుగను పురస్కరించుకుని డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో రవి రాజా బీజేపీలో చేరారు. రవి రాజాకు ఫడ్నవిస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.