SKLM: నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం శ్రీకాకుళం ఆర్అండ్బి భవనాల వసతి గృహం వద్ద హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, రూట్ మ్యాప్ తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో సీఎం బందోబస్తు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.