TG: తన ఇంట్లో జరిగిన చోరీపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ‘తెలంగాణలో దోపిడి దొంగల పాలన నడుస్తుంది. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలో మా స్వగృహంలో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దోచుకుని పోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా డీజీపీని కోరారు.