KDP: జమ్మలమడుగు- కోవెలకుంట్ల రహదారిలోని ఉప్పలపాడు రైల్వే లైన్ వంతెన వద్ద గురువారం ఆటోను వెనుక నుంచి ఆళ్లగడ్డ జమ్మలమడుగు వస్తున్న బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడం వలన మెరుగైన చికిత్స కొరకు కడపకు తరలించారు.