HYD: సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద దాడి, ఆ తర్వాత జరిగిన నిరసనలు, పోలీసుల లాఠీఛార్జ్ ఘటనల నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రాంతంలో టెన్షన్ నెలకొనగా తాజాగా అఘోరీ ప్రకటనతో ఏం జరగనుందనే ప్రశ్న స్థానికంగా వినిపిస్తోంది. ‘రేపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఏం జరగబోతుందో చూడండి. ఆత్మార్మణ చేసుకుంటా హర హర మహదేవ్’ అంటూ నిన్న అఘోరీ ప్రకటన చేసిన విషయం తెలిసింది.