ఢిల్లీలో ప్రమాదక స్థాయిలో వాయు కాలుష్యం పెరిగింది. ఏకంగా ఏక్యూఐ 418కి పడిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. బయటకు వచ్చేటప్పుడు ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాయు కాలుష్యం తగ్గడానికి ప్రభుత్వం దిద్దు చర్యలను ప్రారంభించింది. అయితే దీపావళి తర్వాత మరింతగా కాలుష్యం పెరిగే అవకాశముందని అంచనాలున్నాయి.