TG: కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ MLA మేడిపల్లి సత్యంకు బెదిరింపు కాల్ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే నిందితుడు లండన్‌లో ఉన్నట్లు పోలీసులు AI ద్వారా తెలుసుకున్నారు. అతడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌లోని భవానీనగర్‌కు చెందిన యాస అఖిలేష్‌రెడ్డి అని తెలిపారు. అతడిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశామని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెల్లడించారు.