టెక్ దిగ్గజం గూగుల్‌కు రష్యాలోని మాస్కో కోర్టు భారీ జరిమానా విధించింది. తమ దేశ యూట్యూబ్ ఛానెల్స్‌పై వేటు వేసినందుకు ఆ సంస్థకు 2.5 డెసిలియన్ అమెరికా డాలర్ల జరిమానా విధిస్తు ఆదేశాలు జారీ చేసింది. 2020 నుంచి ఇప్పటివరకు రష్యా ప్రభుత్వ అధికార మీడియా సహా 17 ఛానెల్స్‌ను యూట్యూబ్ నిలిపివేయగా.. వాటిని పునరుద్ధరించాలని కోర్టు గూగుల్‌ను ఆదేశించింది. అందుకు గూగుల్ నిరాకరించడంతో న్యాయస్థానం ఈ జరిమానా విధించింది.