AP: సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది. రేపు ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుని, అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరుకుంటారు. ఎల్లుండి విజయనగరం జిల్లా ఎస్.కోటకు వెళ్లి అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం విశాఖ బీచ్ రోడ్డులోని కోస్టుబ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి.. కలెక్టరేట్లో అధికారిక సమీక్షలో పాల్గొననున్నారు.