సబ్సిడీపై సరఫరా చేయాలని జన్నారం మండలంలోని పలు గ్రామాల రైతులు కోరారు. వానాకాలం సీజన్ కు సంబంధించి వేసిన వరి పంట కోతలు పలు గ్రామాలలో ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం తమకు ప్రభుత్వం సబ్సిడీపై కవర్లను పంపిణీ చేసేదని వారన్నారు. మూడు సంవత్సరాలుగా రావడంలేదని వారు వాపోయారు. మరోవైపు అకాల వర్షాలు పడుతున్నాయని, ధాన్యం తడవకుండా సబ్సిడీపై కవర్లను ఇవ్వాలన్నారు.