దేశంలో చాలా చోట్ల దసరా సందర్భంగా రావణ దహనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. హోలీ పండగ రోజున కాముని దహనం చేస్తారు. కానీ, గోవాలో మాత్రం దీపావళి వేడుకల్లో భాగంగా నరక చతుర్దశి రోజున నరకాసుర దహనం చేసుకుంటారు. అన్ని కూడళ్లలో, మైదానాల్లో నరకాసురుడి దిష్టిబొమ్మలను తయారు చేసి రాత్రి వేళలో వాటిని దహనం చేసి వేడుకలు జరుపుకుంటారు.