ELR: దీపావళి పండుగ సందర్బంగా ఏలూరు జిల్లా ప్రజలకు బుధవారం కలెక్టర్ వెట్టిసెల్వి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, దుష్టశుక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీకని పేర్కొన్నారు. టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.