ATP: యాడికిలో ఓ పేకాట స్థావరంపై సీఐ వీరన్న ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బుధవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 17,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. 52 పేక ముక్కలను సీజ్ చేశారు. ఈ ఘటనపై సీఐ వీరన్న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.