TG: ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్గా జస్టిస్ దేవరాజు నాగార్జునను నియమించారు. ఇవాళ ఆయన ఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈఆర్సీ పాలకమండలి పదవీకాలం ఈనెల 29తో ముగిసింది. కాగా, వనపర్తి జిల్లాకు చెందిన దేవరాజు నాగార్జునను ఛైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2023లో మద్రాస్ హైకోర్టులో ఆయన ఉద్యోగ విరమణ పొందారు. నాగార్జున బాధ్యతల స్వీకారోత్సవానికి CS శాంతికుమారి హాజరయ్యారు.