టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా నవంబర్, డిసెంబర్ మధ్య IND-US రూట్లలో 60 విమానాలు రద్దు చేసింది. నిర్వహణ సమస్య కారణంగా ఎయిర్క్రాప్ట్లు అందుబాటులో లేకపోవడంతో రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది. పీక్ ట్రావెల్ పీరియడ్లో రద్దయిన వాటిలో శాన్ ఫ్రాన్సిస్కో, చికాగోకు వెళ్లే విమానాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఢిల్లీ-చికాగో 14, ఢిల్లీ-వాషింగ్టన్ 28, ముంబై-న్యూయార్క్ రూట్లో నాలుగు విమానాలు ఉన్నాయి.