AP: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0ని ప్రభుత్వం ఆమోదించింది. 2024-29 వరకు ఈ పాలసీ అమలు కానుంది. ఎలక్ట్రానికి ఉత్పత్తి రంగంలో ఆధునిక సాంకేతికతతోపాటు ఉపాధి కల్పన జరగనుంది. విశాఖ, తిరుపతి, నెల్లూరు, శ్రీసిటీ, అనంతరపురం, కడపలో ఇప్పటికే ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు ఉన్నాయి. 2029 నాటికి రూ.4.2 లక్షల కోట్ల మేర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సర్కారు తెలిపింది.