గిఫ్టు డీడ్ (బహుమాన పత్రం/ఒప్పందం) పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గిఫ్టు డీడ్‌ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. రద్దు చేసే వెసులుబాటును కల్పించే నిబంధనలు, సందర్భాలపై గిఫ్టు డీడ్‌లో స్పష్టమైన ప్రస్తావన ఉంటేనే ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. గిఫ్టు డీడ్‌ను రాసిన వ్యక్తి, దాన్ని పొందిన వ్యక్తి పరస్పర అంగీకారంతో మాత్రమే రద్దు చేసే ఛాన్స్ ఉంటుందని పేర్కొంది.