భారత కరెన్సీ రూపాయి కనిష్ఠానికి పడిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా ఆసియా మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనంగా ఉంది. దీంతో ఇండియా ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు నిధులను ఉపసంహరించుకోవడం వల్ల రూపాయి బలహీనపడింది. ఇవాళ సాయంత్రానికి అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్టైమ్ కనిష్టం రూ. 84.09కి పడిపోయింది. గడిచిన రెండు వారాల వ్యవధిలో రూపాయి విలువైన అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నది.