JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కులగణన సర్వే ఎన్యూమరేటర్లకు బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. కథలాపూర్ మండలంలో 92 మంది ఎన్యూమరేటర్లను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ డీఆర్డీవో మదన్మోహన్ మాట్లాడుతూ.. కులగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నిబంధనలను సక్రమంగా అవగాహన చేసుకోవాలని అధికారులకు సూచించారు.