AP: అమరావతి నిర్మాణ డిజైన్లలో ఎలాంటి మార్పులు లేవని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నిర్మాణంలో ఏఐ టెక్నాలజీ వాడుతామని చెప్పారు. అమరావతి అభివృద్ధి పనుల కోసం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. పాత టెండర్ల కాలపరిమితి ముగిసినందున న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే జనవరి నుంచి సీఆర్డీఏ ఆధ్వర్యంలో రాజధాని అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని పునరుద్ఘాటించారు.