హెజ్బొల్లా నూతన చీఫ్‌గా షేక్ నయీం ఖాసింను ఆ సంస్థ నియమించింది. ఈ క్రమంలోనే ఆ బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలి ప్రసంగం చేశారు. ఇజ్రాయెల్‌పై పోరు విషయంలో నస్రల్లా రూపొందించిన యుద్ధ వ్యూహానికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చెేశారు. హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత అనేక మంది పేర్లు వెలుగులోకి రాగా.. చివరకు ఖాసింను ఎన్నుకొన్నారు.