VZM: బొబ్బిలి మండలంలోని ఎం బూర్జవలస గ్రామంలో స్థానిక యువజన సంఘ సభ్యులు బుధవారం మొక్కలు నాటారు. గ్రామంలో ఉన్న చెరువుగట్టు పై వివిధ రకాల మొక్కలు నాటి స్థానికులకు పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొర్లె లక్ష్మణరావు, గణపతి రావు తదితరులు పాల్గొన్నారు.