గుజరాత్ వజ్రాల వ్యాపారి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు ప్రధాని మోదీ హాజరయ్యారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపావళి సమయంలో తన ఉద్యోగులకు భారీగా కానుకలు ఇచ్చే వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియా కుమారుడు ద్రవ్య ఢోలాకియా వివాహం ఈ వారం జరిగింది. ప్రత్యేక హెలికాప్టర్లో ఆ వేడుకకు హాజరైన మోదీ.. వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సావ్జీ షేర్ చేశారు.