ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈనేపథ్యంలో కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు జరిమానాల కొరడా ఝుళిపిస్తున్నారు. అక్టోబరు 1 నుంచి 24 వరకు 47,363 మంది వాహనదారులకు ఛాలాన్లు జారీ చేసి, ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా విధించారు. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లు లేని వారు, ఆ సర్టిఫికెట్ల గడువు తేదీ ముగిసిన వారిపై ఈ జరిమానాలు విధించారు.