AP: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయి కమిటీ ఛైర్మన్‌గా సీఎస్ నీరబ్‌కుమార్‌ను నియమించింది. సభ్యులుగా వ్యవసాయ, ఆర్థిక, పశు సంవర్థకశాఖ, మత్స్యశాఖలతో సహా మొత్తం 20 మంది ఉండనున్నారు. కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేయగా.. వైస్ ఛైర్మన్‌గా జాయింట్ కలెక్టర్, కన్వీనర్‌గా జిల్లా సివిల్ సప్లెస్ అధికారి, 14 మంది సభ్యులు ఉండనున్నారు.