GDL: గద్వాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం గట్టు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 340 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డల పాలిట వరం అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు అనే వదంతులను నమ్మొద్దని చెప్పారు.