MDK: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దీపావళి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని ప్రజలకు పలు సూచనలు చేశారు. బాణాసంచాలు కాల్చే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా పెద్దల సమక్షంలో బాణాసంచాలు కాల్చే విధంగా చూడాలని సూచించారు. బాణసంచా విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు.