ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెకిస్తున్న చిత్రం ‘పుష్ప 2’. అయితే ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో ‘పుష్ప-3’కి అదిరిపోయే లీడ్ ఇవ్వనున్నట్లుగా.. మూవీ క్లైమాక్స్‌ను మరింత సర్ప్రైజింగ్గా మలిచాడట సుకుమార్. పుష్ప-2 క్లైమాక్స్‌లో ఓ స్టార్ హీరో వాయిస్ వినిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వాయిస్‌తో పుష్ప-2 ముగుస్తుందని ప్రచారం. కాగా, ఆ స్టార్ హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది.