మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాకు ‘మాస్ జాతర’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీని వేసవి కానుకగా వచ్చే ఏడాది మే 9న విడుదల చేయనున్నట్లు వివరించింది. కాగా ఈ మూవీకి భాను బోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.