TG: భవిష్యత్లో దేశమంతా తెలంగాణను అనుసరిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో కులగణనపై సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడానికి సర్వే చేస్తామన్నారు. రాహుల్ గాంధీ హామీ మేరకు కులగణన చేస్తున్నట్లు చెప్పారు. సర్వేతో అందరి సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్నారు.