ATP: కొన్ని రోజులుగా జ్వరం కారణంగా స్వల్ప అస్వస్థతకు గురయ్యానని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలిపారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారన్నారు. ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నానని, అసత్య ప్రచారాలు నమ్మవద్దని తెలిపారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తానని పేర్కొన్నారు.