TG: ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేటీఆర్, హరీష్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. 10 నెలల్లో 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ హయాంలో డీఎస్సీ వేశారా? అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అప్పులకుప్పగా ఎలా మారిందని నిలదీశారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదని.. అయినా బీఆర్ఎస్ నేతల ప్రవర్తనలో మార్పు లేదని ఎద్దేవా చేశారు.