HYD: జీహెచ్ఎంసీ కార్మికులు అందిస్తోన్న సేవలు వెలకట్టలేనివని SVR ఫౌండేషన్ సోషల్ వర్కర్ టీ.వినయ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు దీపావళి సందర్భంగా SVR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ వార్డ్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కార్మికులకు టీ.వినయ్ గౌడ్ చీరలు, స్వీట్ బాక్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.