TG: మూసీని శుద్ధి చేయాలని సంకల్పించిందే KCR అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. రూ.1100 కోట్లతో అయిపోయే గోదావరి జలాల కోసం.. రూ.7వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. మూసీని శుద్ధి చేయడానికి బీఆర్ఎస్ అనుకూలమన్న హరీశ్.. మూసీ పేరుతో పేదల ఇళ్లను కూల్చడానికి తాము వ్యతిరేకమన్నారు. ఏక్ పోలీస్ అమలు చేయమంటే సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. ఆయనకు రక్షణ కల్పించే పోలీసులపై కూడా రేవంత్‌కు నమ్మకం లేకుండా పోయిందన్నారు.