మధ్యప్రదేశ్‌లో ఏడు ఏనుగులు మృతి చెందాయి. ఉమారియా జిల్లాలోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన మరో మూడు ఏనుగులకు చికిత్స అందిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మృతి చెందిన ఏనుగులకు పోస్ట్‌మార్టం నిర్వహిసున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.