ATP: కుందుర్పి మండల కేంద్రంలోని బండమీదిపల్లి గ్రామ సమీపంలో టమాటా లోడుతో వెళ్తున్న వాహనం బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. వాహనంలో మార్కెట్కు తరలిస్తున్న టమాటా బాక్సులన్నీ నేలపాలయ్యాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.